Header Banner

ప్రపంచంలోనే అగ్రగణ్య నేతగా రామ్మోహన్.. యువతకు ప్రేరణ! గ్లోబల్ యంగ్ లీడర్‌గా!

  Thu Apr 17, 2025 17:01        Politics

తెలుగుదేశం పార్టీ ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకటించిన 'గ్లోబల్ యంగ్ లీడర్స్ 2024' జాబితాలో ఆయనకు స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ప్రభావశీలంగా పనిచేస్తున్న యువ నాయకులను ఈ ఫోరం ఎంపిక చేస్తూ ప్రతి ఏడాది ప్రకటిస్తుంది. ఈసారి భారత్ నుంచి మొత్తం ఏడుగురు ఎంపికయ్యారు.
2014లో కేవలం 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడు, 2024లో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో పౌర విమానయాన శాఖ విశేషమైన పురోగతిని సాధిస్తోంది. దేశవ్యాప్తంగా విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు, చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు వైమానిక సేవలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక ఈ గౌరవం తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. 'భారత యువత ప్రపంచవ్యాప్తంగా కీలక నిర్ణయాలను తీసుకునే స్థానాల్లోకి ఎదుగుతున్న దృష్ట్యా, ఇది గొప్ప గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. నిజాయితీతో, నూతన ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలనే నన్ను నిరంతరం గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎదిగారన్నారు. కేబినెట్ మంత్రిగా దేశాన్ని సేవ చేయడం.. ఇప్పుడు ప్రపంచ వేదికపై గ్లోబల్ లీడర్‌గా గుర్తింపు పొందడం ప్రతి తెలుగువాడికీ గర్వకారణం అని పేర్కొన్నారు. ఆయన నాయకత్వ నైపుణ్యం, ప్రజాప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధత యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ గౌరవం ఆయనను మరింత ఉత్తేజపరిచేలా చేసి అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

గ్లోబల్ యంగ్ లీడర్‌గా ఎంపికైన మిగతా భారతీయులు ఎవరంటే..?
అనురాగ్ మాలూ - ఓరోఫైల్ వెంచర్స్ వ్యవస్థాపకుడు, పర్వతా రోహకుడు
రితేష్ అగర్వాల్ - ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో
నిపున్ మల్హోత్రా - నిప్మాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
అలోక్ మెడికేపుర అనిల్ - నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు
నటరాజన్ శంకర్ - బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎండీ
మానసి సుబ్రమణ్యం - పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చీఫ్ ఎడిటర్


ఇది కూడా చదవండివైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RamMohanNaidu #GlobalYoungLeader #InspirationForYouth #ProudMoment